telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : కొమురం భీమ్‌ జయంతి సందర్భంగా అప్డేట్

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. కాగా… ఈరోజు తెలంగాణలో నైజాం పాల‌న‌ను ఎదిరించిన పోరాట‌యోధుడు కొమురం భీమ్ జ‌యంతి సంద‌ర్భంగా “ఆర్ఆర్ఆర్” యూనిట్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌ను చేసింది. “గొప్ప ధైర్య‌వంతుడైన తెలంగాణ స్వాతంత్ర్య వీరుడు కొమురం భీమ్‌గారిని ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మా ‘ఆర్ఆర్ఆర్’లో తార‌క్‌ను కొమురం భీమ్‌గా వెండితెర‌పై చూపించ‌డానికి చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాం” అంటూ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వండి.. కనీసం ఒక పోస్టర్ అయినా వదలండి అంటూ ఈ ఇద్దరి స్టార్ హీరోల ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Related posts