telugu navyamedia
రాజకీయ

అర్పితా ముఖర్జీ మరో ఇంట్లో నోట్ల కట్టలు.. మరో 28 కోట్లు, 5 కిలోల బంగారం స్వాధీనం

పశ్చిమ బెంగాల్ లోని ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన అధికారులు.. మంత్రి స్నేహితురాలు.. సినీనటి అర్పితా ముఖర్జీ మరో ఇంట్లో ఈడీ అధికారులు మరోసారి దాడులు చేశారు.

ఈసారి కూడా భారీగా నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. అర్పితాముఖర్జీ ఇంట్లో గతంలో రూ.21 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ..తాజాగా రూ. 28 కోట్ల నగదు, 5 కిలోల బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

How ED ferried valuables seized from Arpita Mukherje's residence after raids  - Bharat Times English News

తన ఫ్లాట్‌ను మంత్రి పార్థ మినీ బ్యాంక్‌గా వాడారని ఈడీ అధికారులకు అర్పిత చెప్పినట్టు తెలుస్తోంది. స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో కేంద్ర ఏజెన్సీ ఈడి చర్య కొనసాగుతోంది.

కోల్‌కతాలోని బెల్ఘరియాలో మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధ‌వారం సాయంత్రం నివాసం‌ ఇంటి తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు.

ఈ క్రమంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నోట్లను లెక్కించేందుకు ఐదుగురు బ్యాంకు అధికారులను పిలిపించారు. దీంతో పాటు నగదు లెక్కింపు యంత్రాలను కూడా తెప్పించారు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

अर्पिता मुखर्जी को एक दिन की रिमांड, स्पेशल कोर्ट में ईडी सोमवार को करेगी  पेश

అర్పితా ముఖర్జీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల అరెస్టు చేశారు. జులై 22న ముఖర్జీ దాచిన స్థలంలో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. తర్వాత, సుదీర్ఘ విచారణ తర్వాత పార్థ ఛటర్జీని కూడా అరెస్టు చేశారు.

ఈ కేసు బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు దోషులుగా తేలితే బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. టీఎంపీపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. 

Related posts