telugu navyamedia
సినిమా వార్తలు

అభిమానులు దయచేసి దానిని ఎవరూ ఫాలో కావొద్దు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా లాల్ సింగ్ చద్దా . అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య బోడి బాలరాజు అనే పాత్రలో కనిపించనున్నారు .. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

 బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Amir Khan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాను తెలుగు వర్షన్ లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ చిత్ర తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా ఉండటం విశేషం. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తన రోల్, ఈ సినిమాలో నటించడంపై తన ఫీలింగ్స్ బయటపెట్టారు నాగ చైతన్య.

 ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివిటీ ఫీల్డ్. టెక్నికల్ గా ఇక్కడికి అక్కడికి తేడా అనేది ఏమీ లేదు. ఒకదానికి ఒకదానికి నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్కి ఒక్కొక్క విజనరీ, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని కంపెర్ చేసుకోలేను డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్ తను నాకు చాలా బాగా గైడ్ చేశాడు.

ఈ మూవీలో చేసిన బోడి బాలరాజు పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనని, 1948 లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని. నాకు చాలా హ్యాపీ అనిపించడమే కాక బ్లెస్సింగ్స్  కూడా  ఉన్నట్టు అనిపించింది. నిజంగా లాల్ సింగ్ చడ్డా తన కెరీర్ లో గొప్ప మెమోరీ అన్నారు.

 ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూపించకుండా అద్భుతంగా నటించారు. అమీర్ ఖాన్ గారు చాలా డిసిప్లేన్ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో నటించడం వల్ల చాలా నేర్చుకున్నా. అమీర్ లాంటి యాక్టర్ పక్కన చేయడం వలన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా అన్నారు చైతూ.

అలానే తన చేతి మణికట్టు పై ఉన్న టాటూ ఏంటని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు గాను, అది సమంతతో తన పెళ్లి జరిగిన తేదీ తాలూకు పచ్చ బొట్టని, అయితే అది ఏంటో తెలియక కొందరు తన ఫ్యాన్స్ దానిని కాపీ కొట్టి చేతిపై వేయించుకోవడం చూశానన్నారు. అందుకే ఫ్యాన్స్ అందరికీ చేస్తున్న విన్నపం ఏమిటంటే, అది నా పెళ్లి తేదీ టాటూ, దయచేసి ఎవరూ దానిని ఫాలో కావొద్దు, టాటూ వేయించుకోవద్దని కోరారు.

Related posts