telugu navyamedia
రాజకీయ

అప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో వారిదే రాజ్యం ..

2017 ముందు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక గ్యాంగ్ లు, మాఫియా ముఠాలు నడుపుతూ ఉండేవి . రాష్ట్రంలో ప్రతి నిత్యం శాంతి భద్రతల సమస్యలే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు .

మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీ కి ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ …ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి .

ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్ లను , మాఫియా ముఠాలను కటకటాలకు పంపించాడు . రాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ప్రధాని చెప్పారు .అలాగే ఉత్తర్ ప్రదేశ్లో గతంలో పేదవారికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండేవి కాదు . దీనికోసం పేదలు రోడ్లెక్కిన సందర్భాలు ఎన్నో వున్నాయి , ఇవ్వాళ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మోడీ చెప్పారు.

రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ దూరదృష్టి వున్నవాడు , స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయుడు , ఆయన పేరు మీద విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సముచితంగా ఉందని ప్రధాని చెప్పారు .
రాబోయే కాలంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయని , రింగ్ రోడ్, మెట్రో రైల్ ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రధాని చెప్పారు . ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి యోగి ఆయన టీమ్ సమర్థవతంగా పాలిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు .

Related posts