telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుకున్నది సాధించిన అక్కినేని కోడలు

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది.  ఇది ఇలా ఉండగా.. తాజాగా సమంత తాను నటిస్తున్న తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో బుధవారం పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ లో నయనతార, సమంత కెమెరా వైపు తిరిగి ఉండటం విశేషం. నయనతారతోనూ, విజయ్ సేతుపతితోనూ నటించాలనేది తన కోరిక అని సమంత పేర్కొంది. ఇప్పటికే విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’లో నటించిన సమంత… ఇప్పుడు ఒకే సినిమాలో తనకు ఇష్టమైన నయన్, విజయ్ సేతుపతిలతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ సంచలనం సృష్టించడం ఖాయమంటోంది సమంత!

Related posts