telugu navyamedia
సినిమా వార్తలు

వేణుమాధ‌వ్ మృతిపై ప్రముఖ క్రికెటర్ వ్యాఖ్యలు

Yousuf

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. నిన్న వేణుమాధవ్ అంత్యక్రియలు మౌలాలీలో ఆయన అభిమానుల మధ్య ముగిశాయి. కాగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ యూసఫ్ ప‌ఠాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వేణు మాధ‌వ్ మృతికి సంతాపం తెలియ‌జేయ‌డం విశేషం. ఒక‌ప్పుడు ఇండియ‌న్ టీంలో ఆల్‌రౌండర్‌గా రాణించిన యూస‌ఫ్ త‌న ట్విట్ట‌ర్‌లో… “వేణు మాధ‌వ్ చ‌నిపోయార‌నే వార్త న‌న్ను షాక్‌కి గురి చేసింది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై నేను చూసిన అద్భుత క‌మెడీయ‌న్స్‌లో ఆయ‌న ఒక‌రు. అత‌నిని ఎవ‌రు రీప్లేస్ చేయ‌లేరు. ఆయ‌నకి నా నివాళులు. కుటుంబ స‌భ్యులకి, మిత్రుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను” అని ట్వీట్‌లో పేర్కొన్నారు యూసఫ్ ప‌ఠాన్.

Related posts