telugu navyamedia
telugu cinema news

విజయ్ దేవరకొండ సినిమాలో హాట్ యాంకర్ 

Anasuya images
ఒకవైపు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా… మరోవైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ఈ యంగ్ యాంకర్. సంక్రాంతి కానుకగా విడుదలైన “ఎఫ్-2” చిత్రంలో అనసూయ ఓ పాటతో పాటు సన్నివేశాల్లో కూడా నటించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “యాత్ర” చిత్రంలో ఎమ్మెల్యేగా నటించింది.
ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆమె విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటించనుంది అనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ లో నిర్మించబోతున్న సినిమాలో ఇప్పటికే తరుణ్ భాస్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. మరో పాత్రకోసం అనసూయను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ చిత్రం కథ మొత్తం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందట. చిత్రంలోని మరో రెండు పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట. 

Related posts

సారీ రా జున్ను… : నాని

ashok

“ఏదైనా జరగొచ్చు” టీజర్ అవుట్

vimala p

మరోమారు కూతురిపై సీనియర్ నటుడి ఫిర్యాదు… అరెస్ట్

vimala p