డబ్బా…? "టోలు" తీస్తా…!?

“మమ్మల్నే డబ్బులడుగుతావ్ బే టోలు తీస్తా ” అంటూ కత్తి తీసాడు ఓ యువకుడు.
టోల్ బూతులో కూర్చున్న యువకుడు భయపడిపోయాడు.
ఇది ఎక్కడో జరిగిన సంఘటన కాదు. మంగళవారం రింగు రోడ్డులో జరిగిన దాదాగిరి.
టోల్ సిబ్బంది డబ్బులు చెల్లించమన్నందుకు టోల్ సిబ్బంది పైనే దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైసిగండి కడ్తాల్ టోల్ ప్లాజా (ఔటర్ రింగ్ రోడ్డు) వద్ద జరిగింది.
హైదరాబాద్ ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్ లక్ష్మిల కుమారుడు మనీష్ గౌడ్ తన స్నేహితులతో కలిసి కారులో శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా, మైసిగండి కడ్తాల్ టోల్ ప్లాజా వద్దకు రాగానే రాజేష్ అనే టోల్ గేట్ ఉద్యోగి అతని కారు ఆపి డబ్బులు చెల్లించవలసిందిగా కోరారు. దాంతో మనీష్ గౌడ్ నన్నే డబ్బులు అడుగుతావా అని స్నేహితులతో కలిసి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే మిగతా సిబ్బంది పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ రాజేష్ ను ఆసుపత్రికి తరలించారు. మనీష్ గౌడ్ ని, అతని అయిదుగురు స్నేహితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించి పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు ఐపీసీ 307 సెక్షన్ కింద ఆరుగురు నిందితులపైనా కేసు నమోదు చేశారు. కస్టడీలోవున్న వీళ్లని రిమాండ్ కు పంపుతున్నామని శంషాబాద్ ఏరియా డీసీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *