సామాజిక

అమీర్ ఖాన్ దంపతులకు స్వైన్ ఫ్లూ

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్రావులకుస్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. దీనితో ఆమీర్ ఖాన్ కు చెందిన పానీ ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2017’ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి అమీర్ ఖాన్ హాజరుకాలేకపోయారు. కాని ప్రత్యక్ష వీడియో ద్వారా కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి అమీర్ ఖాన్ ప్రసంగించారు.
తనకు మరియు తన భార్య కిరణ్ రావు కు స్వైన్ ఫ్లూ సోకడంతో ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లరాదని డాక్టర్ సూచన మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాం అని, తనకు బదులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సహా నటుడు షారూక్ ఖాన్ ను కోరడంతో ఆయన హాజరయ్యారని వెల్లడించారు. సత్యమేవ జయతే వాటర్ కప్ 2017లో భాగస్వాములైన వారందరికి ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత సతీమణి నీతా అంబానీ, పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Related posts

పెరుగుతున్న సీనే నది నీటి మట్టం… ఆందోళనలో ప్యారిస్ ప్రజలు….

admin

ఉపాధ్యాయుడు…

chandra sekkhar

చిచ్చర పిడుగుకు బాబు 'నజరానా'

admin

Leave a Comment